Pawan Kalyan Tweetedt: జనసేన తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు..! 1 d ago
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కాకినాడ-రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని అన్నారు. గత ఐదేళ్లల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు.. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారని చెప్పారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను అని పవన్ అన్నారు. జనసేన తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని 'ఎక్స్' వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసారు.